Site icon NTV Telugu

Modi-Putin: మోడీకి పుతిన్ ఫోన్ కాల్.. అలాస్కా వివరాలు వెల్లడి

Modiputin

Modiputin

ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. సోమవారం నాడు ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశానికి కొన్ని గంటల ముందు పుతిన్ ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా ట్రంప్‌తో జరిగిన సంభాషణను మోడీతో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: INDIA Bloc: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న కూటమి.. రేసులో శివ!

ద్వైపాక్షిక సహకార అంశాలపై మోడీ, పుతిన్ చర్చించారని పీఎంవో తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకాలని.. శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని మోడీ సూచించినట్లుగా పీఎంవో తెలిపింది. ఈ విషయంలో భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుందని పుతిన్‌కు తెలియజేసినట్లుగా పేర్కొంది. ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్

ఇక ఇదే విషయాన్ని ప్రధాని మోడీ కూడా ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘‘నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేసి అలాస్కాలో అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటీవల జరిగిన సమావేశం గురించి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.’’ అని పోస్ట్ చేశారు.

సోమవారం వైట్‌హౌస్ వేదికగా ట్రంప్-జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాధినేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీ కల్పించాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ సమావేశం తర్వాత నేరుగా పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. దాదాపు ఇద్దరి మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. జెలెన్‌స్కీ-పుతిన్ భేటీ కాబోతున్నారని ప్రకటించారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొ్న్నారు. దీనికి పుతిన్-జెలెన్‌స్కీ ఇరుపక్షాలు కూడా అంగీకరించాయి. త్రైపాక్షిక సమావేశం ఏర్పాటుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా స్థలం, తేదీ ప్రకటించలేదు. మొత్తానికి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి మార్గం సుగమం అవుతుంది.

Exit mobile version