Putin: అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) అరెస్ట్ వారెంట్‌ని ధిక్కరించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐసీసీ గతేడాది పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో సభ్యదేశాల పర్యటనకు వెళ్తే పుతిన్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే, ఐసీసీలో మంగోలియా కూడా సభ్యదేశంగా ఉంది. కానీ, ఈ బెదిరింపును ధిక్కరించి మంగోలియా పర్యటనకు వెళ్లిన పుతిన్‌కి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత స్వాగతం పిలికింది. ఇది వెస్ట్రన్ దేశాలను ధిక్కరించడమే అవుతుందని భావించవచ్చు.
మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్‌తో పుతిన్ దిగగానే ఘన స్వాగతం లభించింది. 2022లో రష్యా దళాలు ఉక్రెయిన్‌లో పిల్లల మానవహక్కుల్ని అణిచివేశాడని చెబుతూ ది హేగ్‌లోని ఐసీసీ కోరింది. మరోవైపు ఈ పర్యటనపై ఉక్రెయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పుతిన్ యుద్ధ నేరాల్లో మంగోలియా భాగం పంచుకుందని ఆరోపించింది. అరెస్ట్ వారెంట్ అమలు చేయాలని మంగోలియాను ఉక్రెయిన్ కోరింది. అయితే, కోర్టు కోరిన వారిని అదుపులోకి తీసుకునే బాధ్యత సభ్యదేశాలకు ఉందని ఐసీసీ గత వారం తెలిపింది.
మంగోలియా భౌగోళికంగా రష్యా, చైనాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి రష్యాతో సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అయితే, చైనాతో మాత్రం క్లిష్టమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. సోమియట్ యూనియన్ కాలంలో మంగోలియా రష్యా ధీనంలో ఉంది. 1991 సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ దేశం ఇటు క్రెమ్లిన్‌తో మంచి బంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని మంగోలియా ఎప్పుడూ ఖండించలేదు. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్‌లో కూడా దూరంగా ఉంది. ఇదిలా ఉంటే, ఐసీసీ అధికార పరిధిని రష్యా ఎన్నడూ గుర్తించలేదు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా పుతిన్ ఐసీసీ సభ్యదేశమైన మంగోలియా పర్యటనకు వెళ్లారు.