Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు

  • పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట
  • ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
Puri

Puri

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. 120 మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. గురువారం రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను భవ్యమైన రథయాత్రలో ఊరేగిస్తున్నారు. అయితే ఈ యాత్రకు లక్షల్లో భక్తులు తరలివచ్చారు. అయితే గుండిచా ఆలయం సమీపంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

ఇక రథయాత్ర కోసం ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది మోహరించారు. అయినా కూడా ఒకేచోట పెద్ద ఎత్తున గుమిగూడడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులు స్పందించి పలువురిని రక్షించారు. ఒకరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

https://x.com/odisha_police/status/2077659777753313625