Site icon NTV Telugu

అక్కడ ఎల్లుండి నుంచి స్కూళ్లు ఓపెన్..

school

school

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి… అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం నుంచి కోలుకుంటూ.. క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి స్కూళ్లను తెరిచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.. అందులో భాగంగా.. ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది పంజాబ్‌ ప్రభుత్వం.. ఆగస్టు 2వ తేదీ నుంచి పాఠశాలల తెరవాలంటూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్‌ సర్కార్.. అయితే, కరోనా కేసులు ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నందన.. తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనల పాటించాలని.. కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.. ఇక, ఇప్పటికే 10, 11, 12వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు తెరిచింది ప్రభుత్వం.. ఇప్పుడు అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకుంది.

Exit mobile version