Punjab Politics: వేడెక్కిన రాజకీయం.. చన్నీ వర్సెస్ రబియా సిద్దూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే… అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాట కొలిక్కి రావడం లేదు. ప్రత్యర్థుల్ని వదిలి సొంత పార్టీ వాళ్లపైనే విమర్శలు చేసుకుంటున్నారు. CM చన్నీపైనే సిద్ధూ కూతురు ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో అంతర్గతంగా ఎన్ని వివాదాలు, అభిప్రాయ బేధాలున్నా… ఎన్నికలనే సరికి అంతా కలిసికట్టుగా పని చేయాలి. అప్పుడు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. కానీ… పంజాబ్ కాంగ్రెస్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ… ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదానికి తెరపడడం లేదు. ఎన్నికల్లో పార్టీని కాడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాల్సిన వీళ్లిద్దరి మధ్య పొట్లాటకు తెరపడడం లేదు. తండ్రి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ సిద్ధూ కూతురి కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
అమృత్‌సర్ ఈస్‌లో సిద్ధూ కూతురు రబియా సిద్దూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారామె. చన్నీ అవినీతిపరుడన్నారు. అతను చెప్పుకుంటున్నట్టు పేదవాడు ఏమీ కాదని… బ్యాంక్ అకౌంట్లో 133 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు రబియా సిద్దూ.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
చన్నీని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కూడా తప్పుబట్టారు రబియా సిద్దూ. తప్పనిసరి పరిస్థితుల్లో అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు రబియా. అంత మాత్రం చేత నిజాయితీపరుడ్ని ఎక్కువకాలం ఆపలేరని అన్నారు. తప్పుడు వ్యక్తికి ఆగిపోకతప్పని పరిస్థితులు వస్తాయన్నారు రబియా సిద్దూ. పంజాబ్ అభివృద్ధి కోసం పరితపిస్తున్న తమ తండ్రి సిద్దూతో చన్నీకి ఎలాంటి పోలికా లేదన్నారు రబియా సిద్దూ. నిజానిదే అంతిమ విజయమన్నారామె. మొత్తానికి పంజాబ్ ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే… కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొలిక్కి రాకపోవడం లేదు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!