Site icon NTV Telugu

ఆప్ ఉచిత విద్యుత్ హామీపై పంజాబ్ యువతి ట్వీట్‌…వైర‌ల్‌…

ఇప్ప‌టికే ఢిల్లీలో విజ‌య‌వంత‌మైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమ‌లు చేసి ల‌బ్ది పొందాల‌ని చూస్తున్న‌ది ఆప్‌.  ఇందులో భాగంగా ఆప్ ఇప్ప‌టికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది.  త్వ‌ర‌లోనే ఈ రాష్ట్రానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో ఆప్ విజ‌యం సాధిస్తే త‌ప్ప‌కుండా ఉచిత విద్యుత్‌ను అమ‌లు చేస్తామ‌ని ఆప్ పేర్కొన్న‌ది.  ఆప్ హమీపై పంజాబ్ యువ‌తి వెరైటీగా స్పందించింది.  త‌న‌కు ఉచిత విద్యుత్ అవ‌స‌రం లేద‌ని ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చద్దా కావాలని ట్వీట్ చేసింది.  ఈ విష‌యం తెలుసుకున్న ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే రాఘ‌వ్ చ‌ద్దా అంతే వెరైటీగా స‌మాధానం ఇచ్చారు.  తాను ఆప్ మ్యానిఫెస్టోలో లేన‌ని, ఆప్‌కు ఓటేస్తే ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని, ఈ అవ‌కాశాన్ని పంజాబ్ ప్ర‌జ‌లు వినియోగించుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్టు ఆయ‌న ట్వీట్ చేశారు.  

Read: రాజ్‌కుంద్రా పొర్నోగ్రఫీ కేసులో మరో ట్విస్ట్‌ !

Exit mobile version