Site icon NTV Telugu

Punjab: గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ ఎన్‌కౌంటర్‌లో మృతి..

Punjab

Punjab

Punjab: వరస ఎన్‌కౌంటర్లతో పంజాబ్ రాష్ట్రం దద్దరిల్లులోంది. అక్కడి భగవంత్ మన్ సర్కార్ గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ స్మగ్లర్లు, ఇతర నేరస్తులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో పది కన్నా ఎక్కువ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.

తాజాగా కీలక డ్రగ్ కింగ్ పిన్, గ్యాంగ్ స్టర్ అమృత్ పాల్ సింగ్(22) ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇటీవల అమృత్ పాల్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హెరాయిన్, అతని వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అతడిని జండియాల గురు ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు.

Read Also: Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్.. క్షమించండి అంటూ వీడియో రిలీజ్

ఆ ప్రాంతానికి చేరుకున్న నిందితుడు కస్టడీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పొలీసులుపై కాల్పులు జరిపాడు. ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు అమృత్‌సర్ గ్రామీణ ఎస్పీ సతీందర్ సింగ్ ధృవీకరించారు. విచారణలో అతను 2 కిలోల హెరాయిన్ దాచినట్లు వెల్లడైంది. డ్రగ్స్‌తో పాటు ఒక పిస్టర్ కూడా దాచాడని, దాంతోనే పోలీసులపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అమృత్ పాల్ సింగ్ జండియాల గురు సమీపంలోని భగవా గ్రామానికి చెందిన వాడు. ఇతనిపై మూడు హత్య నేరాలు ఉన్నాయి.

Exit mobile version