Punjab High Alert: పంజాబ్ పోలీసులు రాడికల్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు, సెంట్రల్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులపై అమృత్ పాల్ సింగ్ ఎఫెక్ట్ పడింది. ఏప్రిల్ 14 వరకు పోలీసులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బైసాఖి వరకు రాష్ట్రంలో హై అలర్ట్ విధించింది. పోలీసులుతో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ అన్ని పోలీస్ కార్యాలయాలకు సందేశాలు పంపారు. గతంలో మంజూరైన సెలవులను కూడా రద్దు చేశారు.
Read Also: James Webb telescope: యురేనస్ గ్రహాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూసుండరు..
ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ కనిపించిన అమృత్ పాల్ సింగ్ బైసాఖి రోజున ‘సర్బత్ ఖల్సా’కి పిలుపునిచ్చాడు. ప్రపంచంలోని సిక్కులంతా సమావేశం నిర్వహించాలని కోరాడు. ఇదిలా ఉంటే అతడి కోసం పంజాబ్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. గతంలో అమృత్ సర్ స్వర్ణదేవాలయం వద్ద లొంగిపోతాడనే లీకులు వచ్చినా.. ఆ తరువాత వీటిని అమృత్ పాల్ ఖండించాడు.
ఏప్రిల్ 14న బైసాఖీ రోజున పంజాబ్ లోని భటిండాలో ‘సర్బత్ ఖల్సా’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిక్కు అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’కు పిలుపునిచ్చాడు. అయితే దీనిపై సిక్కు అత్యున్నత సంస్థ స్పందించలేదు. సిక్కు పండితులు, మేధావులతో సంప్రదించిన తర్వాతే అఖల్ తఖ్త్ చీఫ్ మాత్రమే సభకు పిలునివ్వాలో లేదో నిర్ణయించగలనరి శిరోమణి గురుద్వారా పర్భందక్ కమిటీ తెలిపింది. గ్యానీ కిర్పాల్ సింగ్ అకల్ తఖ్త్ చీఫ్ గా ఉన్న సమయంలో ఫిబ్రవరి 16, 1986న చివరిసారిగా ‘సర్భత్ ఖల్సా’ సమావేశం జరిగింది. దీని తర్వాత రాడికల్ సిక్కులు 1986, 2015లో సమావేశానికి పిలుపునిచ్చారు.