Site icon NTV Telugu

CM Bhagwant Mann: “మేము సైలెంట్‌గా ఉన్నాం కాబట్టే సీఎం అయ్యాడు”.. పంజాబ్ సీఎం కూతురు సంచలన ఆరోపణలు..

Cm Bhagwant Mann

Cm Bhagwant Mann

CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఆయన కుమర్తె సీరత్ మాన్ చేసిన విమర్శలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను సీఎం భగవంత్ మాన్ కుమార్తెనని, అయితే ఆయనను నాన్న అని పిలిచే హక్కుని చాలా కాలంగా కోల్పోయాడని అన్నారు. ‘‘నేను ఈ వీడియో చేయడం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా కథ బయటకు రావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మా గురించి ఏది విన్నారో, అది సీఎం మాన్ స్వయంగా చెప్పినవే’’ అని ఆమె అన్నారు.

ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని, తన తల్లి కూడా మౌనంగా ఉందని, మా మౌనమే తమ బలహీనగా భావిస్తున్నట్లు చెప్పింది. మా మౌనం కారణంగానే అతను ప్రస్తుతం సీఎం కుర్చున్నాడనే విషయం అతనికి తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం మాన్ రెండో భార్య గురుకీరత్ గర్భవతి అని, సీఎం మూడోసారి తండ్రి కాబోతున్నాడని సీరత్ వీడియోలో చెప్పింది. ఈ విషయం కూడా తమకు ఇతరుల ద్వారా తెలిసిందని సీరత్ చెప్పారు.

Read Also: Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు

నీకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారిని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మూడో వాడికి జన్మనివ్వాలని అనుకుంటున్నావని సీఎంని ప్రశ్నించింది. గతంలో సీఎం మాన్‌ని కలిసేందుకు తన సోదరుడు దోషన్ రెండుసార్లు పంజాబ్ వెళ్లారని, దోషన్ సీఎం ఇంటికి రానివ్వలేదని, ఆ తర్వాత అతను చంఢీగఢ్‌లో స్నేహితులతో కలిసి ఉన్నాడని సీరత్ చెప్పింది. అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారని, సొంత పిల్లల బాధ్యత తీసుకోలేని వ్యక్తి ప్రజల బాధ్యత ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నించింది.

మేము చూసిన బాధలు పంజాబ్ ప్రజలకు కూడా జరుగుతోందని, తన తల్లి రాజకీయాల్లోకి రావద్దని సీఎం మాన్ విడాకులకు కారణాలు చెబుతన్నాడని, కానీ విడాకులకు చాలా కారణాలు ఉన్నాయని, తన తల్లి ఆమె కథను చెప్పేందుకు సిద్ధంగా ఉందని సీరత్ చెప్పారు. భగవంత్ మాన్ మద్యం సేవించడం, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశడని సంచలన ఆరోపణలు చేశారు. అతను అసెంబ్లీకి, గురుద్వారాలకు కూడా మత్తులోనే వెళ్తాడని ఆరోపించారు.

Exit mobile version