NTV Telugu Site icon

Punjab Govt: నేడు పంజాబ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

Punjab

Punjab

Punjab Govt: ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకోవడంతో.. దాని ప్రభావం పంజాబ్‌ రాష్ట్రంపై పడింది. ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి అతిశీ మర్లెనా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పంజాబ్‌లోని ఆప్‌ సర్కార్ భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, మైనింగ్ శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్‌తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రిజైన్ చేశారు. వీరి రాజీనామాలకు పంజాబ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ వెంటనే గవర్నర్‌ కార్యాలయానికి పంపింది. ఆ తర్వాత పంజాబ్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్లు ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలిపింది.

Read Also: Roop Kumar Yadav: మాజీ మంత్రి అనిల్‌కు రూప్‌ కుమార్‌ కౌంటర్‌..

ఇక, ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే ఫస్ట్ టైం. 30 నెలల భగవంత్ మాన్ సర్కార్ లో ఇది 4వ సారీ మంత్రివర్గ విస్తరణ జరగడం. 117 మంది ఎమ్మెల్యేలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్‌లో కొనసాగుతున్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు ఛాన్స్ ఉంది.