Punjab: జలంధర్‌లో కాల్పులు.. ఆప్ నాయకుడు ఒబెరాయ్ హత్య

  • పంజాబ్‌లోని జలంధర్‌లో కాల్పులు
  • ఆప్ నాయకుడు లక్కీ ఒబెరాయ్ హత్య
  • కారులో ఉండగా కాల్పులు జరిపిన దుండగులు
Punjab Aap Leader

Punjab Aap Leader

పంజాబ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. జలంధర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్‌‌ను కారులో కాల్చి చంపారు. జలంధర్‌లోని మోడల్ టౌన్‌లోని ఒక గురుద్వారా వెలుపల కారులో ఉన్న లక్కీ ఒబెరాయ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్కీ ఒబెరాయ్‌పై అనేక మార్లు కాల్పులు జరిపారని.. ఐదు బుల్లెట్లు లోపలికి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. లక్కీ ఒబెరాయ్ భార్య గతంలో ఆప్ అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ఇది కూడా చదవండి: Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్‌స్టీన్ ఫైల్‌‌‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు