NTV Telugu Site icon

Pune: నాన్నకు అనారోగ్యమని అబద్ధం.. మహిళ సహోద్యోగిని చంపిన వ్యక్తి..

Pune

Pune

Pune: పూణేలో మంగళవారం దారుణం జరిగింది. ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సహోద్యోగిని వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన అందరి కళ్ల ముందే జరిగినా, ఒక్కరూ కూడా ఆపేందుకు ప్రయత్నించ లేదు. ఈ ఘటన నగరంలోని ఎరవాడ ప్రాంతంలో జరిగింది. మహిళని పార్కింగ్ ప్లేస్‌లో వంటగదిలో వాడే కత్తితో పొడిచాడు. తప్పుడు విషయాలు చెప్పి, తనను మోసం చేసి డబ్బులు తీసుకున్నందుకే హత్య జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కి అమెరికా భారీ షాక్.. కీలక హోదాను రద్దు చేయాలని బిల్లు..

ఎరవాడలోని బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీఓ) కంపెనీ అయిన డబ్ల్యుఎన్‌ఎస్ గ్లోబల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల కృష్ణ కనోజ, తన మహిళ కొలీగ్ అయిన 28 ఏళ్ల శుభద కొడారేని హత్య చేశాడు. శుభద తన తండ్రికి బాగా లేదని చెప్పి కనోజ నుంచి చాలా సార్లు డబ్బు అప్పుగా తీసుకుంది. అనారోగ్యం కారణంగా చెప్పి చికిత్స కోసం డబ్బు తీసుకుంది. కనోజ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు, కొడారే తన తండ్రి పరిస్థితిని చూపుతూ నిరాకరించింది.

అయితే, అసలు విషయం తెలుసుకునేందుకు ఇటీవల ఆమె స్వస్థలానికి వెళ్లాడు. అక్కడ ఆమె తండ్రికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలుసుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతలో శుభద కొడారేను కృష్ణ కనోజ ఆఫీస్ పార్కింగ్ ప్లేస్‌కి పిలిచి తన డబ్బు ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. పార్కింగ్ స్థలంలో చాలా మంది ఉన్నప్పటికీ, ఒక్కరూ కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. చాలా మంది ఈ హత్యను రికార్డ్ చేశారు.

Show comments