Rahul Gandhi: హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కోర్టు రూ. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Maha Kumbh Mela: “మహా కుంభ మేళ”కి యాపిల్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్..
సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ జోషి కోర్టు ముందు పూజీకత్తుగా నిలిచారు. రాహుల్ గాంధీ తరుపున వాదించిన న్యాయవాది మిలింద్ పవార్ మాట్లాడుతూ.. కోర్టు ముందు హాజరుకాకుండా రాహుల్ గాంధీకి శాశ్వత మినహాయింపు కూడా ఇచ్చిందని చెప్పారు. దీనిపై ఫిబ్రవరి 18న విచారణ వాయిదా పడింది. 2023 మార్చిలో లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రసంగంలో సావర్కర్ రాసిన పుస్తాకాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావర్కర్ మనువడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.