Naravane Book: నరవణే బుక్ విడుదల కాలేదు.. పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన
- నరవణే బుక్ విడుదల కాలేదు
- పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన విడుదల
- దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోన్న పుస్తకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు పబ్లిక్‌లోనూ రచ్చరచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ పుస్తకంపై అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఈ పుస్తకం బయటకు రావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేతిలోకి ఆ పుస్తకం ఎలా వచ్చిందన్న అంశంపై కూపీ లాగుతున్నారు.
పబ్లిషర్ పెంగ్విన్ స్పందన.
ఇదిలా ఉంటే మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఆ పుస్తకం ప్రచురణ హక్కులు తామే కలిగి ఉన్నామని.. అది ముద్రించలేదని.. డిజిటల్ రూపంలోనూ విడుదల కాలేదని స్పష్టం చేసింది. నరవణే పుస్తక కాఫీలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అమ్మకానికి ప్రజలకు అందుబాటులో ఉంచలేదని స్పష్టం చేసింది. అనధికారిక ప్రచారంలో ఉన్న కాపీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. డిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే పుస్తకం సోషల్ మీడియాలోనూ.. ఆన్‌లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.
రాహుల్ గాంధీ..
తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే ట్వీట్ చేశారు. పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్దం చెప్పుండాలి… లేదంటే నరవణే అయినా అబద్దం చెప్పుండాలి. నేను అయితే నరవణే ట్వీట్‌ను నమ్ముతున్నాను. పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. పుస్తకంలో భారత ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి అసౌకర్యంగా ప్రకటనలు ఉండొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. నరవణే పుస్తకంపై ఎఫ్‌ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..