Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Protestors Disrupt Shah Rukh Khans Film Shoot In Jabalpur Chant Hanuman Chalisa

Pathaan: షారుఖ్ ఖాన్ షూటింగ్‌లో హనుమాన్ చాలీసా.. “బేషరమ్ రంగ్” సాంగ్‌పై నిరసన

Published Date :December 17, 2022 , 3:34 pm
By BV Reddy
Pathaan: షారుఖ్ ఖాన్ షూటింగ్‌లో హనుమాన్ చాలీసా.. “బేషరమ్ రంగ్” సాంగ్‌పై నిరసన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Protestors disrupt Shah Rukh Khan’s film shoot in Jabalpur, chant Hanuman Chalisa: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్’ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో షారుఖ్ ఖాన్ షూటింగ్ ను అడ్డుకున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతం అయిన భేదాఘాట్ లో షారూఖ్ సినిమా షూటింగ్ నడుస్తోంది.

అయితే ఈ షూటింగ్ గురించి తెలిసిన వెంటనే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు భేదాఘాట్‌కు చేరుకున్నారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే గంటల తరబడి నిలబడి, హనుమాన్ చాలీసా పఠించారు. నర్మదా నదీ తీరంలోని తపోభూమిలో హిందువులను అవమానించే ఏ నటుడి సినిమాను అనుమతించబోం అని హిందూ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. అయితే షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ తో పాటు కీలక నటీనటులు అక్కడ లేరు.

Read Also: FIFA World Cup Final: తుదిపోరుకు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్‌

బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణే కాషాయ రంగులో ఉన్న బికనీ ధరించడంతో ఈ వివాదం మొదలైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని రాజకీయ నాయకులు ఈ పాటను తొలగించకుంటే సినిమాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిస్తామని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. ఇదే విధంగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా సినిమాలో అభ్యంతకరమైన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం తొలిసారి కలిసి పఠాన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 25, 2023లో విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ రా ఫీల్డ్ ఏజెంట్ పఠాన్ గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా డబ్బింగ్ కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Besharam Rang
  • bjp
  • Hanuman Chalisa
  • Madhya Pradesh
  • Pathaan

తాజావార్తలు

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

  • Off The Record : సీఎం రేవంత్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పై ఎమ్మెల్యేల మధ్య చర్చ

  • Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?

  • Harshil Kalia: విషాదం.. కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions