NTV Telugu Site icon

Wayand Polls: ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన

Priyankagandhi

Priyankagandhi

కాంగ్రెస్ అగ్ర ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 23న ప్రియాంకాగాంధీ వయనాడ్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. అయితే తాజాగా ప్రియాంక నామినేషన్ ఆమోదం పొందినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. ప్రియాంక నామినేషన్ తర్వాత బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆమె ఆస్తులు, భర్త ఆస్తులపై ఆరోపణలు గుప్పించారు. మొత్తానికి ప్రియాంక నామినేషన్ ఆమోదం పొందడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమవారం నుంచి రెండు రోజుల పాటు కొండ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లతో మమేకమై బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

నవంబర్ 13న వయనాడ్ బైపోల్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రియాంకపై పోటీగా బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీలో క్రీయాశీలకంగా ఉన్న నవ్య హరిదాస్‌ను బరిలోకి దింపింది. ఈమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే గాంధీ కుటుంబానికి కుంచుకోట అయిన రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని రాహుల్‌గాంధీ వదులుకున్నారు. దీంతో వయనాడ్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.