కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ గురువారం పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేరళీయులు ఇష్టపడే కసువ చీర ధరించి ఆమె లోక్‌సభలోకి ప్రవేశించారు. చేతిలో భారత రాజ్యాంగ కాపీని పట్టుకుని వయనాడ్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రియాంక ధరించిన కసువ చీర కేరళీయులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ప్రియాంక నాయనమ్మ ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్ట్‌పై స్పందించిన మాజీ పీఎం షేక్ హసీనా..
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో ప్రియాంక 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. గురువారం ఆమె ఎంపీగా ప్రమాణం చేశారు. అయితే ఆమె కేరళ చీరలో ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కేరళ వారసత్వానికి చిహ్నమైన ఆ చీరతో ఎంపీగా బాధ్యతలను స్వీకరించారు. శతాబ్దాల నాటి గొప్ప చరిత్రను మరోసారి ఆమె గుర్తుచేశారు. కసువ చీరతో కేవలం కేరళ సంస్కృతిని గాక నాటి పూర్వీకుల మూలాలని గుర్తుచేశారు. కసువ చీర అనేది కేరళలో ఉండే హిందూ, బౌద్ధ, జైన సంస్కృతుల నాటిది. మలయాళీ వేడుకల్లో అంతర్భాగం ఈ చీరలు. ఈ చీరతోనే అక్కడ అసలైన పండుగ వాతావరణ వస్తుంది.
ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి ప్రియాంక పార్లమెంట్‌లోకి వస్తుండగా.. స్టాప్ అంటూ రాహుల్ ఆమెను అడ్డుకున్నారు. ఫొటోకు ఒక పోజు ఇవ్వమని చెప్పగా ఆమె చిరునవ్వులు చిందించారు. తర్వాత ఇతరులతో కలిసి పోజివ్వగా రాహుల్ ఫొటో క్లిక్‌మనిపించారు.
ఇది కూడా చదవండి: Health Benefits: రోజూ ఒక్క గ్లాసు ఈ జ్యూస్ తాగితే చాలు.. పాత రోగాలు ఖతం..!