NTV Telugu Site icon

Wayanad: నేడు వయనాడ్కు ప్రియాంక, రాహుల్.. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

Priyanka

Priyanka

Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నియోజక వర్గంలో ఈ రోజు (నవంబర్ 30) కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభలో వారు ప్రసంగిస్తారని ఇప్పటికే హస్తం పార్టీ నేతలు వెల్లడించారు. కాగా, కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో ఈ రోజు మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.

Read Also: Israel–Hamas war: నేడు ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చ

అయితే, కరూలై, వాందూర్, ఎడవాన్నా పట్టణాల్లోనూ ప్రజలను ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కలుసుకుంటారని కేరళ కాంగ్రెస్ నేతలు తెలిపారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఆమె లోక్‌సభ సభ్యురాలిగా గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ హోదాలో తొలిసారిగా ప్రియాంక గాంధీ వయనాడ్ లో పర్యటించబోతున్నారు. ఇక, తనను గెలిపించినందుకు గాను నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలపనున్నారు.

Show comments