Prithvi-2 Missile: పృథ్వీ-2 మిస్సైల్ పరీక్ష విజయవంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పృథ్వీ-2 బాలిస్టిక్ మిస్సైల్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్‌ను పరీక్షించగా.. విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) దేశీయంగా అభివృద్ధి చేసింది. ట్రైనింగ్ లాంచ్‌లో మిస్సైల్ ఖచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి. ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో కూడా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను కలిగిన పృథ్వీ-2.. 500/100 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!