NTV Telugu Site icon

PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. 16-21 తేదీల్లో 3 దేశాల్లో టూర్

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మరోసారి మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటించనున్నారు. గతనెల అక్టోబర్‌లో మోడీ రష్యాకు వెళ్లి వచ్చారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి ఒకేసారి మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 17 సంవత్సరాల్లో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఇది కూడా చదవండి: T series : రాజసాబ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన భూషన్ కుమార్

పర్యటనలో భాగంగా భారతదేశం- నైజీరియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరుచుకోనున్నారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఇరుదేశాలు చర్చలు జరపనున్నాయి. నైజీరియాలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. అనంతరం జీ20 సమ్మిట్‌లో పాల్గొనడానికి రియో డి జెనీరోకు వెళతారు. అక్కడ ప్రధాని నవంబర్ 18-19 తేదీల్లో పర్యటిస్తారు. అటు తర్వాత నవంబర్ 19-21 తేదీల్లో గయానాలో పర్యటించనున్నారు. గయానా పర్యటన 1968 తర్వాత భారత ప్రధానిగా ఇదే తొలిసారి కావడం విశేషం. గయానాలోని జార్జ్‌టౌన్‌లో రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు. దీర్ఘకాల స్నేహాన్ని మరింత మెరుగుపరచడానికి CARICOM సభ్య దేశాల నాయకులతో ప్రధాని మోడీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: APPSC: అలర్ట్: గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష మళ్లీ వాయిదా

Show comments