Site icon NTV Telugu

క్రిప్టోపై కరెన్సీతో మోసపోవద్దు: పీఎం నరేంద్రమోడీ

క్రిప్టో కరెన్సీతో దేశ యువత మోసపోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. క్రప్టో కరెన్సీపై ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన యువ తను హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఆందోళనలు లేవనెత్తారు. “పారదర్శకత లేని కరెన్సీ ప్రకటనల” ద్వారా యువతను తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తగా మసలుకోవాలని ప్రధాని సూచించారు. దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరముందన్నారు.

వివిధ దశలలో దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఏకాభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అప్పటి వరకు క్రిప్టో జోలికి వెళ్లి నష్టపో వద్దని ప్రధాని సూచించారు. క్రమబద్ధీకరించని క్రిప్టో మార్కెట్ “మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్”కి దారి తీసే అవకాశం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయ పడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం వచ్చే వరకు పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు.

Exit mobile version