నేడు యూపీలో ప్రధాని మోడీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కారిడార్‌ను పూర్తి చేశారు. అలాగే 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. కొవిడ్ మహమ్మారి వెంటాడినా నిర్దేశిత సమయంలోనే కారిడార్ ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
సోమవారం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలకు ఆహ్వానం పంపారు. కార్యక్రమానికి 3వేల మంది సాధువులు, ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలకు యూపీ సర్కారు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. దేశ వ్యాప్తంగా దివ్యకాశీ-భవ్యకాశీని 51వేల చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈలోపే ప్రాజెక్టును ప్రారంభించి, విపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలని బీజేపీ భావిస్తోంది.
Also Read
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్‌మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
తాజావార్తలు
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..