Shubhanshu Shukla: అంతరిక్షంలో ఉన్న శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోడీ..

  • ఐఎస్ఎస్‌‌కి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా రికార్డ్..
  • శుక్లాతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ..
Pm Modi

Pm Modi

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా, అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సొంతం చేసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అయిన శుక్లాతో శనివారం ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు.

Read Also: CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం..

ప్రధాని కార్యాలయం శుభాన్షుతో ప్రధాని నవ్వుతూ మాట్లాడిన దృశ్యాలను ఎక్స్‌లో షర్ చేసింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయోగించిన ఆక్సియమ్-4 మిషన్‌ పైలట్‌గా శుక్లా పనిచేశారు. 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో డాకింగ్ పూర్తి చేసింది. శుక్లాతో పాటు యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్ట్‌లు పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ , హంగేరీకి చెందిన టిబోర్ కాపులు ఆక్సియం-4 మిషన్ ద్వారా ఐఎస్ఎస్ చేరారు.