NTV Telugu Site icon

Chhaava: ‘‘ఛావా’’పై ప్రధాని మోడీ ప్రశంసలు..

Pm Modi

Pm Modi

Chhaava: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘‘ఛావా’’ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. విక్కీ కౌశల్ లీడ్ రో‌‌ల్‌లో శంభాజీ క్యారెక్టర్‌లో జీవించారు.

Read Also: IND vs PAK: పాకిస్తాన్ గెలుస్తుంది.. ఐఐటీ బాబా జోస్యం

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ఛావా సినిమాపై ప్రశంసలు కురిపించారు. కొత్త సినిమా ఛావా ప్రస్తుతం హెడ్‌లైన్‌గా మారిందని అన్నారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘‘దేశంలో మరాఠీ భాష మనకు చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించింది. దాని ఆధునిక ఆలోచన కారణంగా, మరాఠీ సాహిత్యం సైన్స్ ఫిక్షన్ రచనలను కూడా సృష్టించారు. గతంలో మహారాష్ట్ర ప్రజలు ఆయుర్వేదం, సైన్స్, లాజికల్ రీజనింగ్‌కి అద్భుత కృషి చేశారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబై కీలక పాత్ర పోషించింది. కొత్త సినిమా ఛావా ప్రస్తుతం ప్రతీచోట ముఖ్యాంశంగా మారింది’’ అని అన్నారు.

“శంభాజీ మహారాజ్ శౌర్యాన్ని ఈ రూపంలో పరిచయం చేయడం శివాజీ సావంత్ మరాఠీ నవల ద్వారా సాధ్యమైంది” అని ప్రధాని మోదీ న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌లో ప్రసంగిస్తూ అన్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఛావా రూ. 219.75 కోట్ల వసూళ్లను సాధించింది. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలు ఇప్పటికే ఈ సినిమాపై పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇతర భాషల్లో కూడా సినిమాని రిలీజ్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయి.