Site icon NTV Telugu

PM Modi: “సిందూర్‌” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.

Read Also: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

కెనడాతో పాటు ప్రధాని మోడీ సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటిస్తారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌‌లో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో, ఇంధన భద్రత, సాంకేతికత మరియు ఆవిష్కరణలతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై భారతదేశం యొక్క వైఖరిని ప్రధాన మంత్రి భారత వైఖరి తెలియచేస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 15 నుంచి 16 వరకు మోడీ సైప్రస్ పర్యటనలో ఉంటారు. ఆ తర్వాత 16-17 వరకు జీ-7 సమావేశంలో పాల్గొంటారు. దీని తర్వాత జూన్ 18న క్రొయేషియాలో పర్యటిస్తారు.

Exit mobile version