Site icon NTV Telugu

Viral Video: ప్రధాని మోడీకి సౌదీ అపూర్వ స్వాగతం.. F15 యుద్ధ విమానాలతో ఎస్కార్ట్..

Pm Modi

Pm Modi

Viral Video: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. రెండు రోజులు పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, సౌదీ ప్రభుత్వం ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికింది. ప్రధాని తన మూడో పర్యటన కావడంతో ఆ దేశ వైమానిక దళ ‘‘రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్’’ తన విమానాలతో ప్రధాని మోడీ విమానానికి ఎస్కార్ట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read Also: Minister Ponguleti: అధికారులు భూ భారతి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..

భారతదేశం-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, సౌదీ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ కానున్నారు. అంతకుముందు, అరబ్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సౌదీ అరేబియాను “విశ్వసనీయ స్నేహితుడు మరియు వ్యూహాత్మక మిత్రుడు”గా అభివర్ణించారు. 2023లో భారతదేశంలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ చివరిసారిగా క్రౌన్ ప్రిన్స్‌ను కలిశారు.

F15 యుద్ధ విమానాలు ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న విమానానికి రెండు వైపుల ఎగురుతూ, ఘన స్వాగతం పలికాయి. ప్రధాని ప్రయాణిస్తున్న విమానం సౌదీ గగనతలానికి చేరడంతో రాయల్ సౌదీ వైమానికి దళం గాల్లోనే స్వాగతం పలికింది. సౌదీ గగనతలం నుంచి జెడ్డా వరకు ఎస్కార్ట్ చేయడం విశేషం. భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాలను హైలైట్ చేస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు. ‘‘భారత్ సౌదీ అరేబియా స్నేహం, ప్రధాని మోడీ స్టేట్ విజిట్‌కి ప్రత్యేక సంజ్ఞగా, ఆయన విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు రాయల్ సౌదీ వైమానిక దళం ఎస్కార్ట్ చేసింది.” అని రాశారు.

Exit mobile version