NTV Telugu Site icon

Presidential Election Result: ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ద్రౌపది ముర్ముకు 540 ఎంపీల ఓట్లు

Draupadi Murmu

Draupadi Murmu

Presidential Election Result: రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అని తెలుస్తున్నా.. ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఎంపీల ఓట్ల లెక్కింపుతో తొలి రౌండ్ ముగిసింది. ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము భారీగా ఓట్లను సాధించారు. ద్రౌపది ముర్ము 540 మంది ఎంపీల మద్దతులో 3,78,000 విలువను సాధించారు. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 మంది ఎంపీలు మద్దతు పలికారు. 1,45,600 ఓట్ల విలువను సాధించారు. మొత్తం 740 మంది ఓట్లేయాగా.. ద్రౌపది ముర్ముకు 540 మంది ఎంపీలు ఓటు వేయగా.. యశ్వంత్ సిన్హాకు 208 మంది ఎంపీలు ఓటేయగా..15 ఓట్లు చెల్లలేదు.

Read Also: Nupur Sharma: నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు యువకుడిపై దాడి.. 8 మంది నిందితుల అరెస్ట్

గత ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కు 7 లక్షల 2 వేల ఓట్ల విలువ రాగా.. ప్రత్యర్థిగా ఉన్న మీరా కుమార్ కు 3 లక్షల 67 వేలు. ప్రస్తుతం ట్రెండ్స్ , బీజేపీ వర్గాల అంచానాల ప్రకారం గతంలో కన్నా ఈ సారి ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య భారీగా తేడా ఉంది. ప్రస్తుతం ఎంపీల ఓట్లలో ద్రౌపది ముర్ము 72.19 శాతం ఓట్లను సాధించారు.కాసేపట్లో ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ఫలితాలు అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. ద్రౌపతి ముర్ముకు 62 శాతం ఓట్లు రావచ్చని అంచానా వేస్తున్నారు. ఫలితాలు వెలువడగానే.. బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత స్వయంగా ప్రధాని మోదీ, ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లి అభినందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో రైరంగ్పూర్ గ్రామంలో సంబరాలు ప్రారంభం అయ్యాయి.