NTV Telugu Site icon

Video: ‘‘మిమ్మల్ని చాలా మిస్సయ్యాం’’..మోడీకి ట్రంప్ ఆత్మీయ ఆలింగనం..

Trump

Trump

Video: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ప్రధాని మోడీకి ట్రంప్ ఘనంగా స్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లోని వెస్ట్ వింగ్ లాబీలో ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు ఒకరినొకరు పలకరించుకుంటూ, హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. ‘‘మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం’’ అని ట్రంప్ మోడీతో అన్నారు. ట్రంప్‌ని మళ్లీ చూడటంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: PM Modi: అక్రమ వలసదారులకు మోడీ షాక్.. వారికి ఆ హక్కు లేదని ప్రకటన..

వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎక్స్‌లో మోడీ, ట్రంప్ ఫోటోలను షేర్ చేశారు. ప్రధాని మోదీ వచ్చిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సహా భారత ప్రతినిధి బృందం వైట్‌హౌస్‌‌కి వెళ్లింది. ప్రధాని మోడీ రాకకు ముందు వైట్ హౌజ్ వద్ద భారత జెండాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, ఆయనను కలిసిన ప్రపంచ నాయకుల్లో నాలుగో వ్యక్తి మోడీ.

ట్రంప్, మోడీకి ‘‘ అవర్ జర్నీ టుగెదర్’’ అనే బుక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్’’ అని సంతకం చేసి, బుక్‌ని మోడీకి అందించారు. 2020లో భారత్ లో తాను పర్యటించినప్పటి ఫోటోలను అందులో పొందుపరిచారు. ‘‘హౌడీ మోడీ’’, ‘‘నమస్తే ట్రంప్’’ ఈవెంట్లలో ఇరువురు నేతలు ఉన్న ఫోటోలు బుక్‌లో ఉన్నాయి. ప్రధాని మోడీని వైట్ హౌజ్‌కి స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉందని ట్రంప్ అన్నారు. ఐదేళ్ల క్రితం నేను సుందరమైన భారతదేశానికి వెళ్లాను, ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ మధ్య ప్రత్యేక బంధం ఉందని ట్రంప్ అన్నారు.