NTV Telugu Site icon

President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు.. భావోద్వేగ ప్రసంగం

Precident Ram Nath Kovind

Precident Ram Nath Kovind

president Ram Nath Kovind’s farewell ceremony: భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఐదేళ్ల క్రితం ఇదే సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశానని.. ఎంపీలందరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంట్ ను ప్రజాస్వామ్య దేవాలయంగా వర్ణించారు.

దేశ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ప్రజల సంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు. శాంతి, సామరస్య విలువ గురించి ఆయన ప్రసంగించారు. ప్రజలు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చే హక్కు ఉందని అయితే ఇది గాంధేయవాదంగా ఉండాలని ఆయన అన్నారు. పార్లమెంట్ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబం అలని.. తాను ఎప్పుడూ ఇందులో ఒక భాగమని కోవింద్ అన్నారు. ఏ కుటుంబంలో అయినా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ఎంపీలకు సూచించారు.

Read Also: Smiti Irani: 18 ఏళ్ల నా కూతురిని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఇబ్బందిపడుతోందని.. మహమ్మారి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తున్నట్లు రామ్ నాథ్ కోవింద్ అన్నారు. కష్ట సమయాల్లో భారత దేశ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగటా ప్రశంసించబడ్డాయని రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో అన్నారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని..ఆమె మార్గదర్శకత్వం నుంచి దేశం ప్రయోజనం పొందుతుందని అన్నారు. రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కల్పించిన దేశ పౌరులకు ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. ఈ నెల 25 సోమవారం రోజున భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.