భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ హాల్‌లో రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. అనంతరం తొమ్మిది భారతీయ భాషల్లో అనువాద వెర్షన్లను విడుదల చేశారు. అనంతరం పార్లమెంట్ సంవిధాన్ సదన్‌లో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరొకరు అరెస్ట్.. ఉమర్‌తో ఎలాంటి సంబంధం ఉందంటే..!
రాజ్యాంగ దినోత్సవ చారిత్రాత్మక సందర్భంగా మీ అందరి మధ్య ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ సభ్యులు భారత రాజ్యాంగాన్ని రూపొందించే పనిని పూర్తి చేశారని గుర్తుచేశారు. ఆ సంవత్సరం ఇదే రోజున రాజ్యాంగాన్ని ఆమోదించారని తెలిపారు. ముసాయిదా కమిటీ ఛైర్మన్ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.. రాజ్యాంగ ప్రధాన శిల్పిలో ఒకరు అని పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇక రాజ్యాంగాన్ని తొమ్మిది భారతీయ భాషల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీలతో సహా తొమ్మిది భాషల్లో అనువాద వెర్షన్‌లను రాష్ట్రపతి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం అందుబాటులోకి తీసుకురావడం, రాజ్యాంగ హక్కులు, విధులపై అవగాహన పెంచడం ఈ చర్య అద్భుతం అంటూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్నారు.
