Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: ఎయిరిండియా ప్రమాదంపై నేడు విడుదలకానున్న ప్రాథమిక నివేదిక!

Ahmedabadplanecrash

Ahmedabadplanecrash

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై శుక్రవారం ప్రాథమిక నివేదిక విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రాయిటర్స్ వర్గాలు పేర్కొన్నాయి. అధికారిక ప్రకటన లేనప్పటికీ.. దాదాపుగా శుక్రవారం నివేదిక విడుదలయ్యే ఛాన్సుందని సమాచారం. ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్‌పైన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి వివిధ కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక రెండు రోజుల్లో బహిర్గతం చేయబోతున్నట్లు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలియజేయబడింది.

ఇది కూడా చదవండి: Maharashtra: కారుతో స్టంట్లు.. అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిన యువకుడు

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు ఎయిరిండియా సంస్థ రూ.కోటి పరిహారం ప్రకటించింది. దీని కోసం రూ.500 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేసింది. దీంట్లో నుంచే పరిహారం అందించనుంది. అలాగే బాధితుల యొక్క బాధ్యతలను పర్యవేక్షించనుంది.

ఇది కూడా చదవండి: Gopireddy Srinivasa Reddy: వాలంటీర్‌ వ్యవస్థపై వైసీపీ నేత హాట్‌ కామెంట్స్.. వాళ్లను నమ్మి పూర్తిగా నష్ట పోయాం..!

Exit mobile version