Pregnant woman : ఎండలో నడిచిన గర్భిణి.. వడదెబ్బతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా భానుడి భగభగలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటలు దాటిందంటే ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తాజాగా ఓ గర్భిణీ ఎండలో సుమారు 7 కిలోమీటర్ల దూరం నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బ తగిలి మరణించింది. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్రలో ఇవాళ (సోమవారం) చోటు చేసుకుంది.
Also Read : Benefits Of Litchi Friut : లిచ్చి యొక్క 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్ అనే గర్భిణీ జనరల్ చెకప్ కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. వైద్య చేయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి ఆటోలో బయలు దేరిచి వచ్చింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఆమె ఇంటికి చేరుకుంది.
Also Read : OMG: సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘పైసా రే పైసా…’ సాంగ్…
అయితే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ వల్ల సోనాలి వాఘాట్ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సోనాలి వాఘాట్ మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలను కోల్పోయింది. భగభగమండే ఎండలో 7 కిలో మీటర్ల దూరం నడవడం వల్ల ఆమె వడదెబ్బకు గురైందని, బాధితురాలికి రక్త హీనత వ్యాధి కూడా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!