ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్ తో “ఓ మంచి ఘోస్ట్”(OMG) చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ నెట్టిట్లో రచ్చ చేస్తుంది. త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతున్న “ఓ మంచి ఘోస్ట్” సినిమాలో ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటకు లిరిక్స్ రాశారు. మంచి బీట్ తో ఉన్న ఈ సాంగ్ కు డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ కొరియోగ్రాఫీ పై ఈ పాట… డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెబుతుంది.
Read Also: NTR: మ్యాన్ ఆఫ్ మాసేస్ కోసం వస్తున్న మాస్ కా దాస్…
ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ”ఓ మంచి ఘోస్ట్” (OMG) శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ఉపేస్తూ… శ్రోతల్ని ఉర్రుతలుగిస్తుంది. ఈ చిత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ కథలో కామెడీతో పాటు ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే హారర్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.