Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ అంత్యక్రియలు గురువారం లక్నోలోని బైకుంఠ ధామ్‌లో ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అల్లుడి చితికి నిప్పంటించిన మామ..
సాధారణంగా కొడుకులు లేదా సోదరులు అంత్యక్రియలు నిర్వహిస్తారు, కానీ ఇక్కడ ఒక అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. అపర్ణా యాదవ్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ సింగ్ బిష్ట్ తన అల్లుడు ప్రతీక్ యాదవ్ చితికి నిప్పంటించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. అఖిలేష్ యాదవ్‌తో సహా కుటుంబ సభ్యులందరూ ఈ కడసారి వీడ్కోలులో పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో ప్రతీక్ యాదవ్ కుమార్తెలు ప్రథమ, ప్రతీక్షలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. పెద్ద కుమార్తె ప్రథమ చాలా సేపు అఖిలేష్ యాదవ్ పక్కనే కూర్చొని కన్నీరుమున్నీరైంది. అపర్ణా యాదవ్ భర్త మరణవార్త విన్న సమయంలో ఆమె అస్సాంలో ఉన్నారు. వెంటనే ఆమె లక్నో చేరుకోగా, అఖిలేష్ యాదవ్ ఆమెను పరామర్శించి మాట్లాడారు.
Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ప్రతీక్ యాదవ్‌కు జంతువులంటే అమితమైన ఇష్టం. ఆయన అంతిమయాత్రలో శవపేటికను పువ్వులతో అలంకరించడమే కాకుండా, ఆయన పెంపుడు కుక్కలతో ఉన్న ఫోటోలను కూడా ఉంచారు. వందలాది మంది ప్రజలు, రాజకీయ నేతలు ఈ అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు కడసారి వీల్కోలు పలికారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్వయంగా వారి నివాసానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు.
అసలేం జరిగిందంటే..
పలు నివేదికల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పనిమనిషి ప్రతీక్ యాదవ్‌ను గదిలో అపస్మారక స్థితిలో ఉండటం గమనించారు. వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజానికి ప్రతీక్ యాదవ్ గత కొంతకాలంగా ‘పల్మనరీ ఎంబోలిజం’ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మే మొదటి వారంలో ఆయనకు కాలికి శస్త్రచికిత్స జరిగింది. గతంలో మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నప్పటికీ, తాజాగా ఆయన అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీకి చెందిన పలువురు నేతలు ప్రతీక్ యాదవ్ మృతికి సంతాపం ప్రకటించారు.
తాజావార్తలు
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!