Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Prashant Kishor Name Is Not On The First List In Bihar Elections

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్.. ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!

Published Date :October 9, 2025 , 9:25 pm
By Suresh Maddala
  • తొలి జాబితాలో లేని ప్రశాంత్ కిషోర్ పేరు
  • ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్
  • ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఇంట్రెస్టింగ్ ఫైటింగ్..  ఢీకొట్టబోయేది ఎవరిని అంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్‌లో ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగబోతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కూటమి తహతహలాడుతున్నాయి.

ఇదిలా ఉంటే గురువారం 51 మందితో కూడిన తొలి జాబితాను ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విడుదల చేశారు. అయితే ఫస్ట్‌లిస్ట్‌లో మాత్రం ప్రశాంత్ కిషోర్ పేరు లేదు. అయితే దీని వెనుక చాలా వ్యూహం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: China: చైనాలో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

రాఘోపూర్‌లో ఆర్జేడీకి మంచి పట్టు ఉన్న అసెంబ్లీ స్థానం. తేజస్వి యాదవ్ ఇక్కడ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. రాఘోపూర్ లేదా సొంత నియోజకవర్గం కర్గహార్ నుంచైనా తేజస్వి యాదవ్ పోటీ చేసే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పేరు తొలి జాబితాలో లేదు. ఇక రితేష్ రంజన్ పాండేను కర్గహార్ అభ్యర్థిగా తొలి జాబితాలో పేరు వచ్చేసింది. ఇక రాఘోపూర్ మిగిలి ఉంది. ఇక్కడ నుంచే తేజస్వి యాదవ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచే ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌ను సరిదిద్దేందుకు వచ్చిన ‘‘బీహార్ బిడ్డ’’గా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించుకున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi-Keir Starmer: బీచ్ ఒడ్డున మోడీ-స్టార్మర్ ముచ్చట్లు.. ఎదురెదురుగా కూర్చుని కబుర్లు

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు. జాబితాలో తరతరాలుగా పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు అన్నాడు. అలాగే మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 48 శాతం ఓట్లు తమకు లభిస్తాయని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రెండు కూటములు 72 శాతం ఓటర్లను మాత్రమే సాధించాయని గుర్తుచేశారు.

ఇక అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవినీతి లేనివారిని ఎంపిక చేసినట్లుగా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు. అభ్యర్థుల్లో ఒక ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ఉన్నాడని తెలిపారు. కుమ్రార్‌లో నిలబెట్టిన అభ్యర్థి కేసీ. సిన్హా.. పాట్నా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు దశాబ్దాలుగా బీహార్, అనేక ఇతర రాష్ట్రాలలోని పాఠశాలల్లో పొందిపరిచారు.

మాంఝీ నుంచి వైబీ.గిరిని నిలబెట్టారు. ఈయన పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాది. హై ప్రొఫైల్ కేసుల్లో కీలక పాత్ర పోషించారు. బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా, పాట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు.

ఇక ముజఫర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ అమిత్ కుమార్ దాస్.. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి. గ్రామీణ ప్రాంతాలకు అవగాహన కల్పించడానికి.. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడానికి విశేష కృషి చేశారు. ఆయన భార్య కూడా డాక్టర్. ముజఫర్‌పూర్‌లో ఒక ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar elections
  • Bihar elections 2025
  • first list
  • Prashant Kishor name

తాజావార్తలు

  • Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి

  • US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు

  • Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions