Site icon NTV Telugu

Prashant Kishor: అందుకే కాంగ్రెస్‌లో చేరడంలేదు.. క్లారిటీ ఇచ్చిన పీకే

Prashant Kishor

Prashant Kishor

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారానికి తెరపడింది… కాంగ్రెస్‌ పార్టీ నేతల నుంచి, పార్టీ అధినేత్రి నుంచి సానుకూలత వ్యక్తం అయినా.. చివరకు పార్టీలోకి రావాలంటూ పీకేను సోనియా గాంధీ ఆహ్వానించిన తర్వాత.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు పీకే.. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు.. దీంతో, గత కొంత కాలంగా హాట్‌ టాపిక్‌గా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడినట్టు అయ్యింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న పార్టీని.. ప్రశాంత్‌ కిషోర్‌ గాడిలో పెడతాడని గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ పరిణామంతో నిరాశే ఎదురైంది.

Read Also: Revanth Reddy: మంత్రి పువ్వాడకు రేవంత్‌రెడ్డి చాలెంజ్.. నువ్వే సీబీఐకి లేఖ రాయి..

కాంగ్రెస్‌ పార్టీ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత సోషల్‌ మీడియా వేదికగా ఆ విషయాన్ని వెల్లడించారు పీకే.. అసలు కారణాలు ఏంటి? అనేది కూడా క్లారిటీ ఇచ్చారు.. వ్యవస్థాగతంగా లోతైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తన కన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని తన ట్వీట్‌లో పేర్కొన్న ఆయన.. తాను కాంగ్రెస్‌లో చేరడం, చేరకపోవడం అంత ముఖ్యం కాదు.. కాంగ్రెస్‌లో పూర్తిగా పునర్‌వ్యవస్థీకరణ జరగడం ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు రాకపోతే ప్రయోజనం లేదన్న పీకే.. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనన తాను తిరస్కరించినట్టు వెల్లడించారు.. కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్‌ కిషోర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version