బీహార్‌లో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల బీహార్‌లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Electric Bike Explode: ఎలక్ట్రిక్ బైక్ పేలుడు.. మహిళ స్పాట్ డెడ్..!
తాజాగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. అధికార-ప్రధాన విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనలో బీహార్‌ను కార్మికుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. గత 30-35 ఏళ్లుగా రాష్ట్రమంతా కార్మికుల రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడ బిడ్డల వీపుపై బస్తాలు మోయవలసి వస్తోందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Story Board : తెలుగు రాష్ట్రాలు మత్తులో జోగుతున్నాయా..? యువతరం మేలుకోకపోతే చిత్తేనా..?
ఇక ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ధ్వజమెత్తారు. రాబోయే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి స్థానం లేదన్నారు. ఎన్ని ఓట్లు సాధిస్తుందో అంచనా వేయమని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. లాలూ ఎన్ని సీట్లు ఇస్తే అంత అని చమత్కరించారు. ఈసారి పొత్తులతో కాకుండా సింగిల్‌గా పోటీ చేయాలని రాహుల్‌గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. రాహుల్‌గాంధీకి దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసి సీట్లు సాధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి.. ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమికి సవాల్ విసిరారు.
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏదొక రోజున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
