NTV Telugu Site icon

Nitish Kumar: నితీష్‌కుమార్‌కు భారతరత్న డిమాండ్.. బీహార్‌లో వెలసిన పోస్టర్లు

Nitieshkumar

Nitieshkumar

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తోంది. పైగా త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ ‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలంటూ పాట్నా నగరమంతా జేడీయూ శ్రేణులు పోస్టర్లు అంటించారు. భారతరత్నకు నితీష్ కుమార్ అర్హులని పోస్టర్లలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Congress: కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..

ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దివంగత నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు మోడీ సర్కార్ భారతరత్న ఇచ్చింది. దీంతో కొన్ని వర్గాల నుంచి సానుభూతి ఓట్లను రాబట్టుకున్నారు. త్వరలో బీహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆర్జేడీ గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాకుండా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కొత్త పార్టీ స్థాపించారు. అంటే ఈసారి ఎన్నికల్లో రసవత్తర పోటీనే ఉండనుంది.

ఇది కూడా చదవండి: GTRI: చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత.. భారత్‌కు బంపర్ అవకాశం..!

మరోసారి అధికారం కోసం జేడీయూ ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగానే భారతరత్న డిమాండ్ తెరపైకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ సుదీర్ఘ కాలం రాష్ట్రానికి సేవలందించారని.. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గట్టెక్కాలంటే సముచిత గౌరవాన్ని ఇవ్వాలని జేడీయూ నాయకుడు వ్యాఖ్యానించారు. నితీష్.. భారతరత్నకు పూర్తి అర్హుడని చెప్పుకొచ్చారు. వాజ్‌పేయ్‌ హయాంలో కేంద్రమంత్రిగా నితీష్ సేవలందించారని గుర్తుచేశారు. ఆయన భారత రత్న పురస్కారాన్ని స్వీకరించేందుకు వీటితో పాటు మరెన్నో కారణాలు ఉన్నాయని జేడీయూ పార్టీ పేర్కొంది. ఇక జేడీయూ పోస్టర్లపై ఆర్జేడీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం కుర్చీని ఖాళీ చేయాలంటూ నితీష్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Kawasaki: కవాసకి నింజాపై దీపావళి ఆఫర్.. భారీగా డిస్కౌంట్