NTV Telugu Site icon

Pope Francis: బాలాసోర్ ట్రైన్ ప్రమాదంపై పోప్ ప్రాన్సిస్ సంతాపం..

Pope Francis

Pope Francis

Pope Francis: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కాక ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. వివిధ దేశాధి నేతలు, ప్రముఖులు మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం బాలాసోర్ సమీపంలోని కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంటో కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇదే సమయంలో బెంగళూర్-హౌరా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.

Read Also: Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..

ఇప్పటికే ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, రష్యా అధినేత పుతిన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాజాగా పోప్ ప్రాన్సిస్ బాలాసోర్ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. ‘‘భారతదేశంలో రెండు రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో అనేక మంది బాధితులకు నా ప్రార్థనలు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. పరలోకపు తండ్రి వారి ఆత్మలను తన రాజ్యంలోకి స్వాగతించాలని’’ కోరకుటుంటున్నానని పోప్ ఫ్రాన్సిస్ సంతాపం వ్యక్తం చేశారు.

Show comments