CM KCR: సీఎం కేసీఆర్ మహరాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను అక్కడ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా నిన్న బీఆర్ఎస్ లోకి పలువురు మహారాష్ట్ర నాయకులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Urfi Javed : చేతులు పైకెత్తి మరీ ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ ఫ్రీ షో చేస్తున్న ఉర్ఫీ..
సమకాలీన రాజకీయాల్లో పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన అంశంగా మారింది. మహారాష్ట్రలో పదవుల కోసం రాజకీయ నాయకులు ఒకపార్టీ నుంచి మరో పార్టీకి ఎలా మారుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ శనివారం అన్నారు. మహరాష్ట్రలో శివసేన-ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో ఎన్సీపీ చేరడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడం గురించి యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. దేశంలో నీటి వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్నవారు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ విలువైన ఆస్తులను ఎందుకు సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అభివృద్ధికి ఉపయోగపడని వారిని ఎన్నుకుని నీరు, కరెంట్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకా ఎంతకాలం కొనసాగాలని ప్రశ్నించారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ (ఈసారి రైతుల ప్రభుత్వం) నినాదంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని, దీనిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ మీదుగా దేశం మొత్తం విస్తరిస్తామని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించే లక్ష్యంతో ఇటీవల ఆయన మెగా ర్యాలీగా షోలాపూర్ వెళ్లారు.