NTV Telugu Site icon

Punjab: ఖలిస్తాన్ వ్యతిరేకించే శివసేన లీడర్‌‌పై దాడి.. చెలరేగిన రాజకీయ దుమారం..

Punjab

Punjab

Punjab: పంజాబ్‌కి చెందిన శివసేన నాయకుడిపై నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడం పొలిటికల్ వివాదంగా మారింది. సందీప్ థాపర్‌పై లూథియానలో కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలు సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో థాపర్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఖలిస్తాన్‌కి బద్ధవ్యతిరేకిగా తన వైఖరిని వినిపించడంతో థాపర్ పేరు తెచ్చుకున్నారు. సందేవన ట్రస్ట్‌లోని ఒక ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా, సాంప్రదాయ నిహాంగ్ దుస్తులు ధరించిన వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు.

Read Also: Headaches : అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా.. వస్తే ఉపశమనం ఎలా పొందాలంటే..

చేతులు జోడించి వేడుకున్నప్పటికీ కనికరం లేకుండా దాడికి పాల్పడ్డారు.ప్రస్తుతం థాపర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఆయనను స్థానికులు అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు. తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు గుర్తుతెలియన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సరబ్‌జిత్ సింగ్ మరియు హర్జోత్ సింగ్ అనే ఇద్దరు అనుమానితులను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో పట్టుకోగా, మూడో వ్యక్తి తెహల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అరెస్టు సమయంలో దాడికి పాల్పడిన వారు ఉపయోగించిన స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పరిణామంపై పంజాబ్ లోని ఆప్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం సహాయమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, అధికారులు విధులను వదిలేసి, ఆప్ నేతల్ని సంతోషపెట్టడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు పర్తాప్ బజ్వా కూడా ఈ సంఘటనను ఖండించారు, అనేక త్యాగాల తర్వాత పంజాబ్‌లో శాంతి తిరిగి వచ్చిందని, రాష్ట్ర వాతావారణాన్ని పాడు చేయడానికి ఎవరిని అనుమతించకూడదని, పంజాబ్‌లో అన్ని మతాలకు చెందిన ప్రజలు ప్రేమ, సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.