NTV Telugu Site icon

Bombay High Court: రాజకీయ పార్టీలకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేదు.. అక్రమ హోర్డింగులపై ఫైర్..

Bombay High Court

Bombay High Court

Bombay High Court: రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే హోర్డింగులపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలపై వారికి ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయం, జస్టిస్ అమిత్ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర అంతటా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై వేసిన పిటిషన్‌ని విచారించింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని పేర్కొంది. చట్టవిరుద్ధమైన హోర్డింగులు ఏర్పాటు చేయొద్దని గతంతో పార్టీలు తమ కార్యకర్తలకు ఆదేశించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కోర్టు తన ఉత్తర్వుల్లో రాజకీయ పార్టీలను హెచ్చరించింది. అయితే, రాజకీయ పార్టీలకు, ఇతర సంస్థలకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేనట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

Read Also: Zia ur Rahman Barq: ఎంపీ ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడి

విచారణ సందర్భంగా న్యాయవాది మనోజ్ సిర్సాత్ ఫోటోలను కోర్టు ముందుంచారు. వీటిని చూసిన ధర్మాసనం.. మేము ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమ హోర్డింగులు, బ్యానర్లను తనిఖీ చేయడానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్లు చర్యలు తీసుకోనట్లు తెలుస్తోందని చెప్పింది. ఇలాంటి హోర్డింగులు పర్యావరణానికి హాని కలిగిచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తరపున న్యాయవాది అనిల్ సాఖారే, ఉల్లంఘనలు, కోర్టు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.

Show comments