NTV Telugu Site icon

RS.2000 note withdrawal: రూ. 2000 నోటకు “నో” చెప్పిన పెట్రోల్ పంప్ ఆపరేటర్.. పోలీసులకు ఫిర్యాదు..

Rs.2000 Note Withdrawal

Rs.2000 Note Withdrawal

RS.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 90 శాతం నోట్లు ఆర్బీఐకి చేరాయి. అయితే చలామణిలో కేవలం 10 శాతం నోట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజలు రూ.2000 నోట్లతో కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల జొమాటో క్యాష్ ఆన్ డెలివరీల్లో 70 శాతం రూ.2000 నోట్లే ఇస్తున్నారని వెల్లడించింది. షాపింగులకు ఎక్కువగా రూ. 2000 నోట్లను వినియోగిస్తున్నారు.

Read Also: China: లైవ్‌లో 7 బాటిళ్ల వోడ్కా తాగాడు.. చివరకు చచ్చిపోయాడు..

ఇదిలా ఉంటే కొందరు రూ. 2000 నోట్లు ఇచ్చి పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకుంటున్నారు. అయితే కొన్ని పెట్రోల్ బంకులు మాత్రం రూ. 2000 నోట్లను తీసుకోవడం లేదని ఫిర్యాదు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇటీవల ఆర్భీఐ కూడా స్పందించింది. ఇలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తాజాగా ఢిల్లీకి చెందిన ఒకరు తన వద్ద నుంచి రూ.2000 నోటు తీసుకోవడానికి తిరస్కరించాడని పెట్రోల్ బంక్ ఆపరేటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్-1లోని పెట్రోల్ పంప్‌లో అటెండర్ రూ. 2,000 నోటును స్వీకరించడానికి నిరాకరించడంతో ఒక వ్యక్తిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ విషయమై శుక్రవారం కోట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తన స్కూటర్‌లో పెట్రోల్ నింపుకోవడానికి సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్-1లోని పెట్రోల్ పంప్‌కు వెళ్లానని, రూ.400 బిల్లుకు ₹2,000 నోటు ఇచ్చానని, అయితే పెట్రోల్ పంప్ అటెండర్ నోటు తీసుకోవడానికి నిరాకరించాడని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments