MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..
- అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కొడుకుపై పోలీస్ కేసు..
- వ్యక్తిపై దాడి.. కిడ్నాప్ చేసిన అజిత్ ప్రసాద్..
- ఈ ఏడాది ఉప ఎన్నికల బరిలో దిగబోతున్న అజిత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Awadhesh Prasad: అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరుపున అవధేష్ ప్రసాద్ గెలిచి సంచలనం సృష్టించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులకే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా అవధేష్ ప్రసాద్ పేరు మార్మోగింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన కుమారుడు అజిత్ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి, దాడి చేశారన్న ఆరోపణలపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఇక్కడి కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్లో రవి తివారీ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది
Read Also: Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
బీఎన్ఎస్ సెక్షన్లు 140 (3) (కిడ్నాప్), 115 (2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 191 (3) (మారణాత్మకమైన ఆయుధాలతో అల్లర్లు చేయడం), 351 (3) ( నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూమి కొనుగోలు కేసులో కమీషన్ వివాదం తర్వాత శనివారం మధ్యాహ్నం ఫైజాబాద్ నగరంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ కూడలి సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అజిత్ ప్రసాద్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తివారీపై దాడి చేసి, కిడ్నాప్ చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
ప్రాపర్టీ డీలింగ్స్‌లో కూడా అజిత్ ప్రసాద్ ప్రమేయం ఉంది. వచ్చే యూపీ ఉప ఎన్నికల్లో మిల్కిపూర్ స్థానం నుంచి అజిత్ ప్రసాద్ ఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎంపీగా అవధేష్ ప్రసాద్ గెలిచిన తర్వాత, మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ సీటుకు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అజిత్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి అయోధ్యలోని పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలియా రిసాలి గ్రామ వాసి. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?