Namaz At Public Place: ఉత్తర్ ప్రదేశ్ లో లక్నో నగరంలో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేసినందుకు ఎంఐఎం నాయకురాలిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎంఐఎం పార్టీకి చెందిన ఉజ్మా పర్వీన్ పై లక్నో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. ఆమె ట్విట్టర్ ద్వారా ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను పంచుకోవడంతో ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రార్థనలు చేసే స్థలాన్ని విధాన్ భవన్ గా ఉజ్మా తప్పుగా చూపించారని, ఇది తప్పుదారి పట్టించేలా ఉందని సెంట్రల్ జోన్ డీసీసీ అపర్ణ రజత్ కౌశిక్ అన్నారు. సోషల్ మీడియాలో హంగామా సృష్టించడానికే ఇలా చేశారని తెలిపారు.
Read Also: Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?
ఉజ్మాపై ఐపీసీ సెక్షన్లు 153 ఏ, 200, 283, ఐటీ చట్టంలోని 66 ప్రకారం నిందితురాలిపై కేసులు నమోదు చేశారు. చిన్న విషయాన్ని పోలీసులు పెద్దగా చూపిస్తున్నారంటూ ఉజ్మా ట్వీట్ చేశారు. మంగళవారం ఆమె ట్విట్టర్ ద్వారా.. లక్నోలోని విధానసభ ముందు ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర నమాజ్ చేస్తున్న వీడియోలు మరియు చిత్రాలను పోస్ట్ చేసింది. మన దేశం స్వేచ్ఛగా ఉందని, ఎక్కడైనా ఉచితంగా నమాజ్ చేసే హక్కు నాకు ఉందంటూ కామెంట్స్ చేసింది.
ఉజ్మా పర్వీన్ సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొంది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థిని లక్నో వెస్ట్ స్థానం నుండి పోటీని ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె నామినేషన్ రద్దు చేయబడింది.