NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీ ‘చొరబాటుదారుల’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈసీ పరిశీలన..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ చేసిన వివాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పరిశీలిస్తోంది. ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ముస్లింలను ఉద్దేశిస్తూ ‘చొరబాటుదారులు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, తాము ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

Read Also: Neha Murder Case: నేహ తండ్రికి క్షమాపణ చెప్పిన సీఎం సిద్ధరామయ్య..

ఏప్రిల్ 21న బన్స్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మన తల్లుల, సోదరీమరణుల బంగారాన్ని లెక్కింది, దానిని పంచుతామని చెబుతున్నారు. వారు ఎవరికి పంచుతారు- మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలోని ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని చెప్పారు’’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశ ఆస్తులపై ముస్లింకే తొలి హక్క ఉందని చెప్పారు. దీనర్థం ఈ ఆస్తి ఎవరికి పంచుతారు, ఎక్కువ మంది పిల్లల ఉన్నారవారికా.? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ చొరబాటుదారులకు పంచుతుందని చెబుతోందని, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటుదారులకు వెళ్లాలా..? మీరు దీన్ని ఆమోదిస్తారా..? అని ప్రధాని మోడీ అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారం, కష్టపడి సంపాదించిన డబ్బును అక్రమ వలసదారులకు లాక్కుని తిరిగి పంపిణీ చేస్తుందని చెబుతోంది, ఇది మీకు ఆమోదయోగ్యమా..? అని ప్రజల్ని ప్రశ్నించారు.