NTV Telugu Site icon

PM MODI: బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..

Pm Modi

Pm Modi

PM MODI: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్‌గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Read Also: GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. బీజేపీ దృష్టితో గిరిజనులు ఓటు బ్యాంకు కాదని, వారు దేశానికి గర్వకారణమని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ చాలా ఏళ్లు దేశాన్ని పాలించినా కేవలం 100 ఏకలవ్య పాఠశాలన్ని మాత్రమే ప్రారంభించిందని, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఏకలవ్య పాఠశాలను ప్రారంభించిందని చెప్పారు. దేశంలో ఒక్క ఆదివాసీ బిడ్డ చదువులేక వెనకబడటం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. గిరిజనులు వేల ఏళ్లుగా అటవీ సంపదతో జీవనోపాధి పొందుతోందని, తమ ప్రభుత్వం ఫారెస్ట్ ప్రాపర్టీ చట్టంతో మార్పులు చేస్తూ.. అటవీ భూమికి సంబంధించి గిరిజనులకు హక్కుల్ని కల్పించిందని పీఎం మోడీ చెప్పారు. గిరిజనులను ‘సికెల్ సెల్ ఎనీమియా’ బాధపడుతున్నా.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.