NTV Telugu Site icon

PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికల ఏడు దశల్లో ఈ రోజు మూడో దశ ముగిసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో పీఎం మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 543 ఎంసీ స్థానాల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమిగా 400+ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదంతో కాషాయ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, ఈ నినాదంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే వారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తు్న్నారు. అయితే, తమపై ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని, రిజర్వేషన్లు తీసేది లేదని, రాజ్యాంగాన్ని మార్చేది లేదని బీజేపీ స్పష్టం చేసింది.

Read Also: SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు

అయితే, తాము ఎందుకు 400 సీట్లు కావాలనే దానిపై ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యంలో రామమందిరానికి కాంగ్రెస్ ‘‘బాబ్రీ తాళం’’ వేయకుండా నిరోధించడానికి ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ధార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీకి 400 సీట్లు కావాలి తద్వారా నేను కాంగ్రెస్ మరియు భారత కూటమి యొక్క అన్ని కుట్రలను ఆపగలను. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ మళ్లీ తీసుకురాకుండా మోడీకి 400 సీట్లు కావాలి, అయోధ్యలోని రామ మందిరానికి కాంగ్రెస్ బాబ్రీ తాళం వేయకుండా ఉండటానికి మోడీ 400 సీట్లు కావాలి’’ అని అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 సీట్లు అవసరమని, దేశంలోని ఖాళీ భూములను, దీవులను కాంగ్రెస్ ఇతర దేశాలకు అప్పగించదని ప్రధాని అన్నారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కుని తన ఓటు బ్యాంకుకు ఇవ్వకుండా తాను 400 సీట్లను కోరుతున్నానని చెప్పారు. లోక్‌‌సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.