Site icon NTV Telugu

Covid-19: మరోసారి కరోనాపై యుద్ధానికి సిద్ధం, ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం.

Modi

Modi

PM Modi Review on Covid-19: కోవిడ్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న ప్రమాదం ఆసన్నమైందని సంకేతాలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్‌ను నియంత్రించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇవాల మధ్యాహ్నం ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇక, గతంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదైన సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే.

read also: Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్

చైనా, దక్షిణ కొరియా, జపాన్ మరియు అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భారతదేశం అప్రమత్తమైంది. ఇప్పటికే కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత.. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ చైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది. చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం దాదాపు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కోవిడ్ యొక్క నాల్గవ వేరియంట్‌కు సంబంధించిన కోవిడ్ కేసుల జినోమ్‌ సీక్వెన్సింగ్ ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే రెండేళ్ల క్రితం నాటి పరిస్థితి తప్పదని రాష్ట్రాలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలో జరుగుతున్న కేసులు, పరీక్షల గురించి అధికారులను ప్రధాని అడిగి తెలుసుకుని కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది.


Khudiram Bose: పార్లమెంట్ సభ్యుల కోసం నేడు ప్రత్యేక ప్రదర్శన!

Exit mobile version