Site icon NTV Telugu

PM Modi: గర్బాపై పాట రాసిన ప్రధాని.. నెట్టింట వీడియో వైరల్..!

Modi

Modi

PM Modi: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా నృత్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను నేడు ప్రధాని తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో షేర్‌ చేశారు. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా ఆరాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ అవటికలయ అనే గర్బా పాటను నేను రచించాను అని ప్రధాని తెలిపారు. మనందరిపైనా అమ్మవారి కృప ఉండాలన్నారు. ఇక, గాయని పూర్వా మంత్రి తన అద్భుతమైన స్వరంతో దీనిని ఆలపించారని ప్రధాని మోడీ మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.

Read Also: Bigg Boss Nainika : ఆయన చెప్పాడని జానీ మాస్టర్ దగ్గరకు నా బిడ్డను పంపలేదు.. బిగ్ బాస్ నైనిక తల్లి

ఇక, గతేడాది కూడా శరన్నవరాత్రుల వేళ గర్బాపై ప్రత్యేకమైన కవితను నరేంద్ర మోడీ రాశారు. అది మ్యూజిక్‌ వీడియో రూపంలో అప్పుడు రిలీజ్ అయింది. చాలా ఏళ్ల కిత్రం దీన్ని రాశాను.. ఇప్పుడు ఈ గీతాన్ని వింటుంటే పాత స్మృతులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అంతేకాదు, గర్బాపై మరో పాటను కూడా తాను రాశాను.. నవరాత్రి సందర్భంగా అందరితో ఆ పాటను పంచుకుంటానని గతంలో ఆయన చేసిన ట్విట్టర్ పోస్టులో చెప్పారు. ఆ పాటకు గాయని ధ్వని భానుశాలి గాత్రాన్ని అందివ్వగా, స్వరాలను బాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్‌ బాగ్చి సమకూర్చారు. జేజస్ట్‌ మ్యూజిక్‌ సంస్థ ఆ పాటను చిత్రీకరణ చేసింది.

Exit mobile version